Namaste NRI

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యం లో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు మరియు పంచాంగ శ్రవణం

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి సెంగ్ కాంగ్ లోని శ్రీ అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఏప్రిల్ 9 న ఎంతో ఘనంగా జరిగాయి.  శ్రీ క్రోధి నామ సంవత్సరం లో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వేడుకల్లో బాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ గారు పంచాంగ శ్రవణం చేశారు. ఆ తరువాత సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా వ్రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు మరియు పంచాంగ కర్తలు శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు మరియు శ్రీ మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ గార్లు సిద్ధం చేయ డం జరిగింది. ఈ వేడుకల్లో సుమారు 500 వరకు ప్రవాస తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు ఇతర రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న వారందరికి సాంప్రదాయ  ఉగాది పచ్చడి మరియు పులిహోర మొదలగు  ప్రసాదం పంపిణి చేయడం జరిగింది.  ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ  వారు చేస్తున్న కార్యక్రమాలు  స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా మరియు బసిక అనిత రెడ్డి,  వ్యవరించారు.

dbda3e95 a742 47b3 8ce6 cefd88e70616

ఉగాది వేడుకలు విజయవంతంగా జరుగుటకు మరియు ప్రసాదానికి సహాయం అందించిన దాతలకు, స్పాన్సర్స్ కు  మరియు సంబరాల్లో పాల్గొన్న ప్రతీ  ఒక్కరికి TCSS అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ మరియు కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ  ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త  నల్ల,  గోనె  నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి  వెంకట రమణ, నడికట్ల భాస్క ర్, రవి కృష్ణ విజాపూర్ మరియు కార్యవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి,  విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి మొదలగు వారు భక్తులం దరికీ ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యం గా ఈ వేడుకలకు ఘనంగా జరగడానికి చేయూతనందించిన మై హోమ్ కంస్ట్రక్షన్ వారికి, చమిరాజ్ రామాంజనేయులు (టింకర్ టాట్స్), మన్నము శ్రీమాన్ (గరంటో అకాడమీ) మరియు రాజిడి రాకేష్ రెడ్డి గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

967494e3 e4a6 426d b3e9 5f67a3644f30

ఈ ఉగాది వేడుకల్లో  శ్రీమతి పప్పు దుర్గా శర్మ గారి వద్ద సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటున్న విద్యార్థులు రామిరెడ్డి శ్రేష్ఠ రెడ్డి, శ్రీవర్షిత రెడ్డి బండి, కంభంపాటి సాయి శాన్వి, లేష్ణ లలిత అన్నం, దేవగుప్తపు సమన్విత, కుప్పం వైష్ణవి సహస్ర మరియు కొండపల్లి చిశిత లు అష్టలక్ష్మి మరియు దేవ దేవంభజే కీర్తన లపై ప్రదర్శిం చిన సాంప్రదాయ నృత్యాలు ఎంతో ఆకట్టు కున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events