Namaste NRI

ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు … భారత్‌పై అమెరికా  ఒత్తిడి

రష్యా నుంచి చమురు దిగుమతుల్లో కోతలు విధిస్తున్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ భారత్‌పై అమెరికా  మరింత ఒత్తిడి పెంచుతున్నది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ  ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారత్‌ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నదని మరోమారు విమర్శించింది. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. ఆ దేశం నుంచి చమురు కొనుగోళ్లను ఆపాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్‌ మిల్లర్‌ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి క్రూడాయిల్‌ కొనడాన్ని ఆపాలని ట్రంప్ స్పష్టం చెబుతున్నారని వెల్లడించారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఈ యుద్ధానికి నిధులు సమకూర్చడాని భారత్‌ కొనసాగించడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. ఇరుదేశాల చమురు వాణిజ్యం తమకు ఆశ్చర్యం కలిగించింది. రష్యన్ చమురు కొనుగోలులో భారత్ చైనాతో ముడిపడి ఉందని తెలిస్తే ప్రజలు షాక్‌ అవ గురవుతారు. అయితే ఇదే వాస్తవం అని వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events