Namaste NRI

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన స్వాత్మానందేంద్ర స్వామీజీ

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలుకుసుకున్నారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌ రెడ్డి నివాసానికి వెళ్ళిన స్వాత్మానందేంద్ర ప్రాచీన ఆలయాలకు అడ్డంకిగా మారిన పురావస్తుశాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఆలయాలు అభివృద్ధికి పురావస్తుశాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయని కేంద్ర మంత్రి దృష్టికి స్వామి తీసుకొచ్చారు. ప్రాచీన నిర్మాణాలపై  పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు, అభివృద్ధికి కూడా అంతే ముఖ్యమని స్వామీజీ కేంద్రమంత్రికి విపులంగా వివరించారు.

          తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు పురావస్తు శాఖ నియమనిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠం ఈ నెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న చాతుర్మాస్య దీక్షల ప్రాశస్యం స్వాత్యానందేంద్ర వివరించారు. రాజాశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు కిషన్‌ రెడ్డి దంపతులకు ఉండాలని స్వాత్మానందేంద్ర ఆకాంక్షించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి, శారదా పీఠం దుశ్శాలువతో కిషన్‌ రెడ్డి దంపతులను స్వాత్మానందేంద్ర సత్కరించారు. శ్రీ శారదా స్వారూప రాజశ్యామల అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని దగ్గరుండి కిషన్‌ రెడ్డి దంపతులు సాగనంపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress