Namaste NRI

మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన గజానన.. వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం

సుదర్శన్‌ పరుచూరి హీరోగా నటిస్తున్న చిత్రం మిస్టర్‌ సెలబ్రిటీ. రవికిషోర్‌ దర్శకుడు. ఆర్‌పీ సినిమాస్‌ పతాకంపై చిన్న రెడ్డయ్య, ఎన్‌.పాండురంగారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, శ్రీదీక్ష, నాజర్‌, రఘుబాబు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి గజానన అనే దైవభక్తి ప్రధానం గా సాగే పాటను రిలీజ్‌ చేశారు. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అభినయం, నృత్యం ఆకట్టుకునేలా ఉంది. గణేష్‌ రాసిన ఈ పాటకు వినోద్‌ బాణీ అందించాడు. వినాయకచవితి నవరాత్రుల్లో మార్మోగిపోయే పాట ఇదని, త్వరలోనే రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, దర్శకత్వం: రవికిషోర్‌.

Social Share Spread Message

Latest News