Namaste NRI

అభిమానుల్లో క‌ల‌వ‌రం..అక‌స్మాత్తుగా ఆ జంట బ్రేక‌ప్

అమెరికాలో పింక్ ష‌ర్ట్ క‌పుల్ చాలా ఫేమ‌స్‌. సోష‌ల్ మీడియాలో ఆ జంట‌ను ఫాలో అయ్యే వారు ఎక్కువ‌. ఇక యూట్యూబ్‌లో ఆ జంట‌ను సుమారు 2.5 కోట్ల మంది ఫాలోఅవుతున్నారు. కేవ‌లం మూడేళ్ల‌లోనే ఆ జంట ఫుల్ పాపులారిటీ సంపాదించింది. గులాబీ రంగు టీష‌ర్ట్‌లు వేసుకుని ఆ దంప‌తులు ర‌క‌ర‌కాల వీడియోల‌ను ఆన్‌ లైన్‌లో పోస్టు చేసేవారు. తొలుత ఆ జంట టిక్‌టాక్‌లో చాలా ఫేమ‌స్ అయ్యింది. ఆ త‌ర్వాత లెన్త్ ఎక్కువ వీడియోల‌ను చూసి యూట్యూబ్‌లో పోస్టు చేశారు. దీంతో ఆ క‌పుల్‌ యూట్యూబ్ స్టార్స్‌గా మారారు. కానీ అక‌స్మా త్తుగా ఆ జంట బ్రేక‌ప్ అవుతున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న ఆన్‌లైన్ అభిమానుల్లో క‌ల‌వ‌రం రేపుతున్న‌ది. కేడ‌న్ క్రిస్టియ‌న్‌స‌న్‌, అలెసా ఎక్‌స్టీన్ అనే ఇద్ద‌రికీ యూట్యూబ్‌లో మిలియ‌న్ల సంఖ్య‌లో ఫాలోవ‌ర్లు ఉన్నారు. అమెరికా లోని ఆరిజోనాకు చెందిన ఈ జంట త‌మ బ్రేక‌ప్ గురించి తాజా వీడియోలో వెల్ల‌డించింది. జంట‌గా విడిపోతు న్నాం కానీ స్నేహితులుగా క‌లిసి ఉంటామ‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events