వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మట్కా. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు. కరుణకుమార్ దర్శకత్వం. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, కన్నడ కిశోర్ కీలక పాత్రధారులు. అజయ్‌ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీశ్, రాజ్ తిరందాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలుకానుంది. 1958 నుంచి 1982 మధ్యకాలంలో జరిగే కథ ఇది. అందుకే అప్పటి వాతావరణానికి అద్దం పట్టేలా భారీ సెట్టింగులను నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తాడని, తన కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలోని పాత్ర కోసం వరుణ్ మేక్‌ఓవర్ అవుతున్నారని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: జీవీ ప్రకాశ్‌కుమార్.
