అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన చిత్రం తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో ఈ నెల 7న విడుదలైన ఈ సినిమా వందకోట్ల క్లబ్ లోకి చేరినందుకు చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. అక్కినేని నాగచైతన్య కెరీర్ లో తొలి వందకోట్ల సినిమాగా ఇది నిలిచిందని మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అన్-సీజన్ లో విడుదలైనప్పటికీ, ఆదివారాలు తప్ప సెలవులు లేనప్పటికీ, హెచ్ డీ వెర్షన్ తొలిరోజే లీకైనప్పటికీ, ఆవేమీ తండేల్ పై ప్రభావం చూపించలేకపోయాయి. సెకండ్ వీకెండ్ ముగియక ముందే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. డొమస్టిక్ మార్కెట్లోనే కాక, తెలుగు రాష్ర్టాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా తండేల్ లాభదాయకమైన వెంచర్ అయ్యింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయి, లాభాల బాటలో పయనిస్తుంది. ఇంతటి విజయానికి కారకులైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.
