Namaste NRI

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.