శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. దేవ స్థాన కార్య నిర్వహణాధికారి ఇ.పెద్దిరాజు పట్టువస్త్రాలను సమర్పించారు.
విశాఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన ముగిసింది. యుద్ధనౌకల సమీక్ష నిమిత్తం విచ్చేసిన రాష్ట్రపతి విశాఖలో బస చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ నావల్ ఎయిర్ బస్ ఐఎన్ఎస్ డేగలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు.