భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును ప్రారంభమైంది.
నల్గొండ టౌన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను భేటీ అయ్యారు.