నూతన సచివాలయంలోని రెండో అంతస్తులో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ ఛాంబర్లో మంత్రి హరీశ్‌రావు ఆసీనులయ్యారు. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు.
నూతన సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం చేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాలోని 100 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేస్తు ఫైల్ పై తొలి సంతకం చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.
పౌరసరఫరాల శాఖలో ఐసీడీఎస్ అంగన్వాడీలకు పోషకాల సన్నబియ్యం పంపిణీ ఫైలుపై, బీసీ, ఎంబీసీ కార్పోరేషన్ల ఆక్షన్ ప్లాన్ ఫైల్‌పై మంత్రి గంగుల కమలాకర్ తొలిసంతకం చేశారు.