Skip to main content

Namaste NRI

ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌కు .. ప్ర‌తిష్టాత్మ‌క సాహిత్య‌ అవార్డు

చైనాలో ఫుడ్ డెలివ‌రీ రైడ‌ర్‌ త‌న రోజువారీ అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. డెలివ‌రీ బాయ్‌లు ప‌డే ఆవేద‌న త‌న క‌వితల్లో వ్య‌క్తం చేసేవాడు. అయితే ఓ రోజు త‌ప్పుడు అడ్ర‌స్‌కు ఫుడ్ డెలివ‌రీ చేశాడు. అక్క‌డ ఆ అడ్ర‌స్‌లో ఉన్న వ్య‌క్తి డెలివ‌రీ రైడ‌ర్‌తో అనుచితంగా మాట్లాడాడు. ఇంత వ‌య‌సు వ‌చ్చినా ఈ పని చేస్తున్నావా అంటూ మాట‌లు అనేశాడు. ఆ మ‌న‌స్తాపంతో రైడ‌ర్ వాంగ్ జిబింగ్ ఓ భావోద్వేగ క‌వితను రాశాడు. దాన్ని య‌ధావిధిగా త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ క‌విత‌ చైనీయుల‌ను ఆక‌ర్షించింది. ఆన్‌లైన్‌లో వాంగ్‌కు ఫాలోయింగ్ పెరిగిపోయింది. మ‌నిషి తొంద‌ర‌పాటు గురించి ఆ క‌విత‌లో అత‌ను రాశాడు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు లో ఫ్ల‌యిట్ అని ఓ క‌వితా సంక‌ల‌నాన్ని పోస్టు చేశాడు. చైనా సాహిత్య‌కారులు అంద‌జేసే ప్ర‌తిష్టాత్మ‌క లూ జున్ సాహిత్య ప్రైజ్‌కు ఆ సంక‌ల‌నం ఎంపికైంది. ప్రైజ్‌మ‌నీలో భాగంగా విజేత‌కు సుమారు 14వేల డాల‌ర్లు ఇవ్వ‌నున్నారు.

Social Share Spread Message

Latest News