Skip to main content

Namaste NRI

ముమ్మరంగా 19th ATA Conference & Youth Convention 2026 కు ఏర్పాట్లు

మేరీలాండ్ లో జరగనున్న 19th ఆటా కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. బాల్టిమోర్ కన్వేన్షన్ వేదికగా జూలై 31 నుండి 2 ఆగష్టు వరకు జరగనున్న ఈ వేడుకలకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే ఈ వేడుకలకు రావాల్సిన ప్రముఖ సినీ, రాజకీయ, సంగీత దర్శకులు, సింగర్స్ ,నిర్మాతలు విద్యా సాంస్కృతిక సాహితీవేత్తలు చేరుకున్నారు. సినీనటులు రాజేంద్రప్రసాద్, నితిన్, ఆడవి శేషు, పూజా హేగ్డే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, యాంకర్ శ్రీముఖి, ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి చేరుకున్నారు.

ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల , కో ఆర్డినేటర్ రవి చల్ల, నేషనల్ కో ఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి టీం ఈ వేడుకలను పర్యవేక్షిస్తుంది.

ఈ వేడుకల్లో ప్రతి కార్యక్రమానికి ఫోరంలను ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు.ఉమెన్ ఫోరం, ఫ్యాషన్ షో, వెండర్ ఎగ్జిబిషన్, యూత్ ఫోరం, షార్ట్ ఫిల్మ్, రీల్స్ ఫొటోగ్రఫీ, వివాహ పరిచయ వేదిక, ఫార్మర్స్, శివపార్వతల కల్యాణం, రైతు ఫోరం మొదలైన ఆసక్తికరమైన వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుకల్లో పాల్గొనడానికి మరియు వివరాలకు ఆటా website www.atacoference.org ద్వారా పాస్ లు పొందవచ్చు.

Social Share Spread Message

Latest News