Skip to main content

Namaste NRI

సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగ ఎన్నికయిన నల్ల భాస్కర్ గుప్త

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) /TCSS యొక్క పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2వ తేదీన స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. సమావేశంలో ముందుగా పన్నెండో సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి మరియు ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించి ఆమోదం పొందడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు సమ్మయ్య మోలుగూరి మరియు ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మోడరేటర్ గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.

2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన మరియు నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ప్రస్తుత పదవీకాల అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన నల్ల భాస్కర్ గుప్త మరియు ఆయన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు మరియు మల్లారెడ్డి కళ్లెం గార్లు ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న కార్య మరియు కార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

ఈ సారి ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన తెల్లదేవరపల్లి కిషన్ రావు మరియు మల్లారెడ్డి కళ్లెంకి సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు.

దీనితో పాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి మరియు శ్రీధర్ బండారు గార్లను ప్రకటించి ఎన్నుకోవడం జరిగింది.

నూతన కార్యవర్గం మరియు కార్యనిర్వాహక వర్గంలో అధ్యక్షులు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ మరియు యసరావేణి విజయ కుమార్ ఉన్నట్టు తెలిపారు.

మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు గడపను, తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన అసాధారణ మరియు అద్భుతమైన సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి కార్యనిర్వాహక మరియు సభ్యులందరూ మర్యాదపూర్వకంగా సన్మానించారు. గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు గడప అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి మరియు నీలం మహేందర్ లను ఘనంగా కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్ మరియు సుగుణాకర్ రెడ్డి లకు కార్యనిర్వాహక మరియు సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News