Skip to main content

Namaste NRI

అనకాపల్లి నుంచి మాస్ సాంగ్ ను రిలీజ్

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధానపాత్రలు పోషిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ చిత్రం అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక,నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ మాస్‌ గీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు.

డర్టీ గ్యాంగ్‌ స్టర్స్‌ అంటూ సాగే ఈపాటను ప్రముఖ నటుడు సోనూసూద్‌ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కేకే రాసిన ఈ పాటను, దేవ్‌జండ్‌ స్వరపరచగా, పృథ్వీ చంద్ర, ఈకే కలిసి ఆలపించారు. మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఈ పాట సాగింది. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, కథ, కథనం: నక్కిన త్రినాథరావు, నిర్మాణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌.

Social Share Spread Message

Latest News