Skip to main content

Namaste NRI

ఆలోచన సినిమా నుంచి భజగోవిందం\\\\\\\\\\\\\ సాంగ్ రిలీజ్

సీనియర్‌ నటులు జి.వి.నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్‌ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్‌ ప్రధాన పాత్రధారులుగా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ఆలోచన. సురేందర్‌ చాచా దర్శకుడు. ప్రదీప్‌కుమార్‌, శ్రీనివాస్‌ గుండబోయిన నిర్మాతలు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా నుంచి భజగోవిందం పాటను చిన్నజీయర్‌ స్వామి ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. స్నేహం విలువ తెలియజెప్పే సినిమా ఇదని, వేదాంత జీవన సారాన్ని సామాన్యునికి సైతం అందించాలనే సంకల్పమే ఈ సినిమా అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: వియాన్‌.

Social Share Spread Message

Latest News