Skip to main content

Namaste NRI

ఏఐతో కొత్త వైరస్‌ల సృష్టి .. స్టాన్‌ఫోర్డ్‌ శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సు(ఏఐ) ఉపయోగించి కొత్త వైరస్‌లను రూపొందించారు. వాటిలో 16 వైరస్‌లు బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయగల క్రీయాశీలక క్రిములుగా మారాయి. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆర్క్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బృందం సైన్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. ఈ వైరస్‌లు కేవలం బ్యాక్టీరియాపై మాత్రమే దాడి చేస్తాయి. ఇవి మనుషులకు, జంతువులకు లేదా మొక్కలకు సంక్రమించలేవు.

సూపర్‌ బగ్స్‌కు వ్యతిరేకంగా కొత్త ఆయుధాన్ని ఏఐ అందించగలదని ఈ అధ్యయనంతో స్పష్టమవుతున్నది. అదేసమయంలో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డీఎన్‌ఏ డాటాపై శిక్షణ పొందిన సాఫ్ట్‌వేర్‌ ఇప్పుడు మొదటి నుంచి పనిచేసే ఒక వైరస్‌ను సృష్టించగలదని నిరూపితమైంది. జాన్స్‌ హాప్‌కిన్స్‌కు చెందిన ఇద్దరు పరిశోధకులు థామస్‌ ఇంగిల్స్‌బై, మోరిట్జ్‌ హాంకే దీనిపై స్పందిస్తూ ఏఐతో వైరల్‌ జన్యువులను తయారు చేసే సామర్థ్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని, కానీ దానిని నియంత్రించే నియమాలు మాత్రం లేవని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events