అన్షు, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం హుషార్ పిట్టలు. బిక్షు దర్శకత్వం. ఈ చిత్రానికి వెంకట్ యాదవ్ దర్శకుడు. ట్రైలర్‌ను ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ప్రేక్షకులు పెట్టే డబ్బులకు వందశాతం న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత వెంకట్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ సినిమా చూస్తూ కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చానని, తన కెరీర్‌ను కూడా మలుపుతిప్పుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు చరణ్‌అర్జున్ అన్నారు. సందేశం కలబోసిన కమర్షియల్ చిత్రమిదని, పతాక ఘట్టాలు హృదయానికి హత్తుకుంటాయని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు.ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.





























