Skip to main content

Namaste NRI

హాయ్ చెప్పడానికి నయన్ సిద్ధం

నయనతార, కెవిన్‌ ప్రధాన పాత్రల్లో నటించినచిత్రం హాయ్‌. విష్ణు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదొక ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. చెన్నై, కోయంబత్తూరు, పొల్లాచ్చి నేపథ్యంలో కథ నడుస్తుంది. కుటుంబమంతా థియేటర్‌లో చూసి ఆస్వాదించేలా ఈ చిత్రాన్ని రూపొందించాం అని దర్శకుడు తెలిపారు.

కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, హాస్యం ప్రధానంగా ప్రతీ ఒక్కరి మనసుల్ని కదిలించే సినిమా ఇదని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేష్‌శివన్‌, ఎస్‌.ఎస్‌.లలిత్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events