Skip to main content

Namaste NRI

మేము ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ : వరుణ్‌తేజ్‌

హీరో వరుణ్‌తేజ్‌ నటించిన హారర్‌ కామెడీ డ్రామా కొరియన్‌ కనకరాజు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ సినిమా విజయంపై మొదటి నుంచి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము ఊహించిన దానికంటే ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు. ప్రతీ ఎపిసోడ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. నాకు బాబు పుట్టిన తర్వాత ఈ విజయం రావడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తున్నది అన్నారు. ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా చేశామని, తమ ప్రయత్నం ఫలించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ వరుణ్‌తేజ్‌ కటౌట్‌కు తగిన సినిమా ఇది. కనకరాజు, కొరియన్‌ పాత్రల్లో ఆయన అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌ కనబరిచారు. సత్య కాంబినేషన్‌లో ఆయన పండించిన కామెడీ హైలైట్‌గా నిలిచింది అన్నారు. చాలా రోజుల తర్వాత పెద్ద విజయం దక్కిందని, థియేటర్ల ముందు హౌస్‌ఫుల్‌ బోర్డులు చూస్తుంటే సంతోషంగా ఉందని నిర్మాత రాజీవ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్‌ కూడా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events