Skip to main content

Namaste NRI

ఈ టీజర్‌ శాంపిల్‌ మాత్రమే … సినిమా అంతకు మించి : సతీశ్‌ జై

సతీశ్‌ జై హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం గజ. ఫర్నాజ్‌ శెట్టి కథానాయిక. డా.మైత్రి శరణ్‌ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. మైత్రీమూవీమేకర్స్‌ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నది. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో మంచు మనోజ్‌ అతిథిగా విచ్చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాకు గట్స్‌ కా బాప్ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టాను. ఈ కథకు ఆ సత్తా ఉంది. ఆడియన్‌గా ఆలోచించి రాసుకున్న కథ ఇది.

ఈ టీజర్‌ శాంపిల్‌ మాత్రమే. సినిమా అంతకు మించి ఉంటుంది అని నమ్మకంగా చెప్పారు హీరో, దర్శకుడు సతీశ్‌ జై. సినిమాలో భాగమైనందుకు కథానాయిక ఫర్నాజ్‌ ఆనందం వెలిబుచ్చింది. అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇదని నిర్మాత మైత్రి శరణ్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర సమర్పకుడు చలమలశెట్టి సునీల్‌, సెవెన్‌ హిల్స్‌ సతీశ్‌, సహ నిర్మాతలు మధుసూదన్‌, పద్మనాభరెడ్డి, మిట్లపల్లి సురేందర్‌, కెమెరామేన్‌ జగదీశ్‌ చీకటి కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events