ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకరమే అయినా ఇప్పుడు మరీ అంత టెన్సన్ పడాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వైట్‌హౌజ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలో ఆ వేరియంట్‌కు చెందిన పాజిటివ్ కేసు ఒకటి బయటపడిరదన్నారు. ప్రస్తుతం దేశంలో లాక్‌డౌన్ అవసరం లేదని అన్నారు. ఒకవేళ ప్రజలు వ్యాక్సిన్ తీసుకుని ఉంటే మాస్కులు ధరిస్తే లాక్‌డౌన్ అవసరం రాదని ఆయన స్పష్టం చేశారు. 8 ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు విధించింది. అయితే అమెరికాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదే వైరస్ వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. పొరుగు దేశమైన కెనడాలోనూ కేసులు నమోదు అయ్యాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)