Skip to main content

Namaste NRI

ఎన్ఎస్ఆర్ రూటుపై భార‌త్ ఆస‌క్తి: వ్లాదిమిర్ పుతిన్‌

ఆర్కిటిక్ స‌ముద్ర మార్గానికి సంబంధించిన నార్త‌ర్న్ సీ రూట్‌(ఎన్ఎస్ఆర్) రూటుపై భార‌త్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని, ప్ర‌స్తుతం ప‌శ్చిమ దేశాల ఆంక్ష‌ల నేప‌థ్యంలో త‌మ‌తో వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు భార‌త్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు పుతిన్ పేర్కొన్నారు. ఆర్కిటిక్ స‌ముద్ర మార్గంలో షిప్పింగ్ కోసం చైనా, ఇండియా లాంటి దేశాలు ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నట్లు ఆయ‌న చెప్పారు.

ఈశాన ర‌ష్యా భాగంలో జ‌రుగుతున్న సైనిక విన్యాసాల‌ను వీక్షించేందుకు జ‌పాన్ స‌మీపంలో ఉన్న దీవుల‌కు పుతిన్ వెళ్లారు. ఆర్కిటిక్ రీజియ‌న్స్ ఫోర‌మ్‌లో భార‌త్ కీల‌క భాగ‌స్వామి అన్నారు. చెన్నై నుంచి వ్లాదివోస్తోక్ కారిడార్‌ను, ఎన్ఎస్ఆర్ రూట్‌లో భాగంగా అభివృద్ధి చేయ‌నున్నారు. చెన్నై-వ్లాదివోస‌తోక్ కారిడార్ సుమారు 10,380 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. తూర్పు ఆసియా, యూరోప్ మ‌ధ్య షార్టెస్ట్ షిప్పింగ్ రూట్‌గా ఎన్ఎస్ఆర్‌ను భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events