కామాక్షి భాస్కర్ల ప్రధానపాత్ర పోషించిన చిత్రం అగధ. శ్రవణ్‌రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్ కీలక పాత్రధారులు. ఎమ్మెస్ రాజు దర్శకుడు. ఈ నెల 14న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో కామాక్షి భాస్కర్ల విలేకరులతో ముచ్చటించింది. ఇందులో నా పాత్ర పేరు మహాదేవి. దేవుని అనుగ్రహంతో పుట్టే పాత్ర అది. నా ప్రిన్సిపల్స్ పక్కన పెట్టి మహాదేవిగా మారడానికి చాలా కష్టపడ్డాను. బుద్ధిజం పుస్తకాల్ని చదివాను అన్నారు.

ఎమ్మెస్ రాజుగారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పాను. కానీ ఎమ్మెస్ రాజుగారు కూర్చోబట్టి కథ చెప్పి, నాపాత్రను వివరించారు. నిజంగా కథ, నా పాత్ర మనస్ఫూర్తిగా నచ్చాయి. ఇది కేవలం హారర్ థ్రిల్లర్ మాత్రమే కాదు. డివైన్ మూమెంట్స్ కూడా ఇందులో బలంగా ఉంటాయి. టెక్నికల్‌గా కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది అని తెలిపింది. సీనియర్ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనను అనుష్కతో పోల్చడంపై స్పందిస్తూ.. అంత పెద్ద నిర్మాత అలా అనడం ఆనందంగా ఉంది. ఆయన అనుష్క గారితో పోల్చడం నా బాధ్యతను మరింత పెంచింది అని నవ్వుతూ చెప్పారు.















