Skip to main content

Namaste NRI

అమెరికాలో భారతీయుడికి జైలుశిక్ష?

పిల్ల‌ల లైంగిక వేధింపుల‌కు చెందిన డిజిట‌ల్ మెటీరియ‌ల్‌ను సేక‌రించిన కేసులో భార‌తీయ సంత‌తి వ్య‌క్తి అభిషేక్ విజ‌య్‌కుమార్‌ను అమెరికా కోర్టు శిక్షించ‌నున్న‌ది. న్యూజెర్సీలోని హాస్‌బ్రౌక్ హైట్స్‌లో నివాసం ఉండే అత‌ను త‌న నేరాన్ని అంగీక‌రించాడు. ర‌జ‌స్వ‌ల ద‌శ దాటని చిన్నారుల‌కు చెందిన ఇమేజ్‌లు, వీడియోలు కూడా క‌లిగి ఉన్న‌ట్లు అత‌నిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2024 మార్చిలో నిందితుడు కావాల‌నే ఆ మెటీరియ‌ల్‌ను సేక‌రించిన‌ట్లు కోర్టులో రుజువైంది. విజ‌య్‌కుమార్ వ‌ద్ద ఉన్న ఎల‌క్ట్రానిక్ డివైస్‌ల్లో, పిల్ల‌ల లైంగిక వేధింపుల‌కు చెందిన క‌నీసం 200 ఇమేజ్‌లు ఉన్న‌ట్లు గుర్తించారు. మూడేళ్ల చిన్నారిని లైంగికంగా వేధిస్తున్న ఓ వ్య‌క్తి ఇమేజ్ కూడా అత‌ని డివైస్‌లో ఉన్న‌ది.

పిల్ల‌ల‌పై లైంగిక వేధింపులు ఆపేందుకు ఎఫ్‌బీఐ నిరంత‌రం పోరాటం చేస్తుంద‌ని అసిస్టెంట్ అటార్నీ జ‌న‌ర‌ల్ ఏ టైసెన్ దువా తెలిపారు. పిల్ల‌ల లైంగిక వేధింపుల‌కు చెందిన ఇమేజ్‌లు క‌లిగి ఉన్న కేసులో నిందితుడు విజ‌య్‌కుమార్‌కు సుమారు 20 ఏళ్ల జైలుశిక్ష ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. 2027, జ‌న‌వ‌రి ఆరో తేదీన తుది తీర్పు, శిక్ష‌ను వెలువ‌రించ‌నున్నారు. అమెరికా శిక్షాస్మృతి మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events