Skip to main content

Namaste NRI

విడుదలకు సిద్ధమైన ధర్మస్థల నియోజకవర్గం .. ఎప్పుడంటే

సుమన్‌, సాయికుమార్‌, నటరాజ్‌, వరుణ్‌సందేశ్‌, వితికా షేరు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ధర్మస్థల నియోజకవర్గం. జై జ్ఞానప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్‌ నిర్మిస్తున్న ఈ పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. నటీనటులంతా ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందం వెలిబుచ్చారు. అన్ని వర్గాలకూ నచ్చే ఓ మంచి కథతో థియేటర్లలోకి రాబోతున్నామని దర్శకుడు జై జ్ఞానప్రభ తోట నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత మేరుం భాస్కర్‌, పీవీఆర్‌ సినిమాస్‌ ప్రతినిధి ఉదయ్‌ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి మాటలు: అస్లాం, కెమెరా: వెంకట హనుమ, సంగీతం: మహావీర్‌ ఎల్లంధర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events