Skip to main content

Namaste NRI

చిత్ర పరిశ్రమలో విషాదం.. దిగ్గజ నటి షావుకారు జానకి ఇక లేరు

ప్రముఖ నటి సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, శ్వాసకోశ, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడలో 400లకు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టిఆర్, ఎఎన్ఆర్, శివాజీ గణేశన్ తో నాయికగా నటించారు. షావుకారు జానకి అసలు పేరు శంకరమంచి జానకి. 2023లో వచ్చిన అన్నీ మంచి శకునములే జానకి చివరి చిత్రం. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో షావుకారు జానకి జన్మించారు. 1950లో షావుకారు చిత్రంతో కథానాయికగా జానకి సినీరంగ ప్రవేశం చేశారు. సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకున్న ఘనత ఆమెది. 73 ఏళ్లుగా తెలుగునాట సుపరిచితమైన సినీ ప్రస్థానం జానకి సొంతం చేసుకున్నారు.

షావుకారు జానకి డైటాగ్స్ తీరుకు ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తొలినాళ్లలో రేడియో నాటకాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి చిత్రం షావుకారు సినిమాలో జానకికి బిఎన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్రలో నటించి, 1955లో ఏకంగా 11 సినిమాల్లో నటించి మెప్పించారు. కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేశారు. హీరోయిన్ కృష్ణకుమారి, షావుకారు జానకికి స్వయాన చెల్లెలు. 1952 లో తమిళ చిత్రం వలయపతి లో నటించారు. రోజులు మారాయి 1955లో జానకి సినీ జీవితాన్నిమార్చిన చిత్రం. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఏది నిజం సినిమాకు జాతీయ బహుమతి అందుకున్నారు. 1962 తర్వాత సహాయ పాత్రల్లో నటించగా, 2022లో పద్మశ్రీ పురష్కారం, కళైమామణి, నంది, రాజ్యోత్సవ అవార్డులు, సైమా లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం షావుకారు జానకి అందుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events