Skip to main content

Namaste NRI

ఈ సినిమా సక్సెస్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది : సునీల్ నారంగ్

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా రోమాంచకం. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు.
ఈ సినిమా కథను రెండు గంటల పాటు సందీప్, ప్రణయ్ లకు చెప్పాను. కథ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ కట్ చూశాక సందీప్ వంగా ఒక బీర్ ఓపెన్ చేసి ఆస్కార్ అవార్డ్ లా నా చేతికి అందించారు. ఆ సందర్భం ఎంతో సంతోషాన్నిచ్చింది అని డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.

హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్ మాట్లాడుతూ 8 వసంతాలు సినిమా తర్వాత అనేక స్క్రిప్ట్స్ విన్నాను. కానీ వేణుగోపాల్ చెప్పిన ఈ కథకు కనెక్ట్ అయ్యాను. ఇదొక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అని అన్నారు. నేను నమ్మిన కథ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. బడ్డీ కామెడీ మూవీ ఇది. చాలా సరదాగా సాగుతుంటుంది అని అన్నారు. ఈ కథ విని రెండున్నర గంటలు నాన్ స్టాప్ గా నవ్వుకున్నా. పాత్ర పరంగా కొత్తగా నటించాననే ఫీల్ నాకే కలిగింది అని హీరో సుమంత్ ప్రభాస్ తెలిపారు.ఈ సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events