Skip to main content

Namaste NRI

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుంచి మనసా వాచా సాంగ్ రిలీజ్

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఎపిక్‌-ఫస్ట్‌ సెమిస్టర్‌. 90స్ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ఈ సినిమా నుంచి మనసా వాచా అనే మూడో గీతాన్ని విడుదల చేశారు.


హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ స్వరపరచిన ఈ గీతాన్ని ప్రముఖ గాయకులు చిత్ర, ఎస్పీ చరణ్‌ ఆలపించారు. శ్రీహర్ష ఈమని రచన చేశారు. ప్రేమ, విరహం, ఎడబాటు వంటి భావోద్వేగాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. ప్రేమికుల మానసిక సంఘర్షణను ఈ పాటలో ఆవిష్కరించారు. లండన్‌ నేపథ్యంలో సాగే న్యూఏజ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, వినోదానికి పెద్దపీట వేశామని మేకర్స్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events