Skip to main content

Namaste NRI

అందుకే మేం కూడా యుద్ధంలో .. మార్క్ కార్నీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అమెరికాతో తాము యుద్ధంలో ఉన్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం మేర సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అమెరికా తీసుకున్న ఈ చర్యను తమ దేశంపై జరిగిన ఆర్థిక దాడిగా ఆయన అభివర్ణించారు. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు చివరి నిమిషంలో విఫలమయ్యాయి.

అమెరికా విధించిన షరతులు తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా, కీలక పరిశ్రమలను బలహీనపరిచేలా ఉన్నాయని, అందుకే తాము వాటిని అంగీకరించలేదని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. మీపై దాడి జరిగినప్పుడు మీరు యుద్ధంలో ఉన్నట్లే భావించాలని, ఇప్పుడు మాపై దాడి జరిగిందని, అందుకే మేం కూడా యుద్ధంలోనే ఉన్నామ‌ని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయానికి ప్రతీకారంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే స్టీల్, గృహోపకరణాలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి ఉత్పత్తులపై తాము కూడా సుంకాలు విధించనున్నట్లు ఆయన ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events