Skip to main content

Namaste NRI

నాట్స్ ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో కొలరాడోలో తెలుగు విద్యార్దుల కోసం చదరంగం పోటీలు నిర్వహించింది. కొలరాడో చాప్టర్ ఆధ్వర్యంలో నాట్స్ కొలరాడో చెస్ కాంపిటీషన్ 2026 పేరిట స్థానిక లోన్ ట్రీ సివిక్ సెంటర్‌లో నిర్వహించిన ఈ చదరంగ పోటీలకు మంచి స్పందన లభించింది.

టోర్నమెంట్‌లోని పలు విభాగాల్లో ప్రతి రౌండ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. గ్రేడ్ కే–3 విభాగంలో దిత్వి ప్రథమ, హంషిక ద్వితీయ, స్రింక తృతీయ స్థానాల్లో నిలిచారు. గ్రేడ్ 4–7 విభాగంలో మిత్ర ఎస్ విజేతగా, శ్రీతేజ ద్వితీయ, శ్రియాన్ష్ తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. గ్రేడ్ 8–12 విభాగంలో నాగ శైలేష్ అజేయంగా టోర్నీ ఛాంపియన్‌గా నిలవగా, ఆశ్రిత్ ద్వితీయ, అర్జున్ తృతీయ స్థానాలు సాధించారు.

నాట్స్ ఫైనాన్స్-మార్కెటింగ్ విభాగ వైస్-ప్రెసిడెంట్ అనుదీప్ ఆర్ల, కొలరాడో చాప్టర్ కోఆర్డినేటర్స్ మంజుల కుంటముక్కల, ప్రత్యూష అప్పరసు, జనసుధ, సత్యజీ చిగురుపాటి, సాయి చరణ్, జ్యోత్స్న గుంటూరు, దివ్య చంద్రిక, సాయికృష్ణ తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నాట్స్ వాలంటీర్లకు, నాట్స్ నాయకులకు, పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు నాట్స్ కొలరాడో చాప్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. దీన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరినీ నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events