Skip to main content

Namaste NRI

నా లైఫ్‌లో రోమాంచకం అంటే అదే : సందీప్‌రెడ్డి వంగా

సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ రోమాంచకం. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌కుమార్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సందీప్‌రెడ్డి వంగా మాట్లాడారు. ఈ సినిమా నేను చూశాను. చాలా బావుంది. హీరో క్యారెక్టరైజేషన్‌ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించి మెప్పించడం కష్టం. హీరో, హీరోయిన్‌, వారి స్నేహితుల పాత్రలు చూస్తుంటే సినిమాలా అనిపించదు. పక్కనుంచి వీళ్లను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కథ విన్నప్పుడు ఎంతగా నవ్వానో, చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వాను. మా భద్రకాళి పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన చిత్రాలన్నింటికీ సెన్సార్‌ ఏ సర్టిఫికెట్లే వచ్చాయి. రాబోతున్న స్పిరిట్‌కి కూడా ఏ సరిఫికెట్టే వస్తుంది. కానీ ఈ సినిమా వల్ల మా సంస్థకు తొలిసారి క్లీన్‌ యు/ఏ సర్టిఫికెట్‌ రానున్నది. సినిమా అంతా ఓ ఫ్లోలో కామెడీతో వెళ్తుంది. ఫ్యామిలీస్‌తో వచ్చి ఈ సినిమాను ఎంజాయ్‌ చేయండి. నా లైఫ్‌లో రోమాంచకం అంటే ప్రభాస్‌ అన్నతో సినిమా చేయడమే అని అన్నారు.

ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారని కథానాయిక అనంతిక సనిల్‌కుమార్‌ అన్నారు. భద్రకాళీ పిక్చర్స్‌లో రానున్న ఫన్‌ అండ్‌ క్యూట్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని హీరో సుమంత్‌ ప్రభాస్‌ నమ్మకంగా చెప్పారు. ఇంకా నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా, డైరెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, డీవోపీ పవన్‌ పప్పుల, సంగీత దర్శకుడు వాసుకి వైభవ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సంకీర్తన కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events