Skip to main content

Namaste NRI

మొగుడు కావాలి.. గూగుల్‌ ఫామ్‌ పెట్టిన యువతి!

అమెరికాకు చెందిన ఒక యువతి పెండ్లికి ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ఉద్యోగ ఖాళీ తరహాలో ఆమె ఆన్‌లైన్‌లో మొగుడు కావాలి అని ఒక ప్రకటన ఇచ్చింది. న్యూయార్క్‌ అప్పటికే డేటింగ్‌ యాప్స్‌ లాంటి వాటి ద్వారా తోడు కోసం వెతికి కాలాన్ని వృథా చేసుకుని విసిగి వేసారిన ఎరిన్‌ పాటర్సన్‌ అనే యువతి వినూత్నంగా ఒక గూగుల్‌ ఫామ్‌ను రూపొందించింది. దానిలో ఆమె తనకు కావాల్సిన భర్త గురించి ప్రశ్నలను ఉంచింది. నేను ఒక అందమైన, తెలివైన, సహృదయం గల, కాఫీ /డిన్నర్‌ చేస్తూ మంచి సంభాషణలు ఆస్వాదించే వ్యక్తి కోసం చూస్తున్నా అని పేర్కొంది.

ఆ ఫాంలోని ప్రశ్నావళిలో దరఖాస్తు చేయబోయే వ్యక్తి వృత్తిపరమైన సంబంధాలు, కెరీర్‌ లక్ష్యాలు, సంబంధాల పట్ల అంచనాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. అంతేకాక దరఖాస్తుదారుడి వృత్తిపరమైన లక్ష్యాలు, అతడి రోజువారీ దినచర్య, వ్యాయామ విధానాలు, పెండ్లిపై, కుటుంబంపై అతడి అభిప్రాయాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆమె ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఆమెను పెండ్లాడటానికి పలువురు క్యూ కట్టారు. ఇప్పటివరకు ఆమెకు 240 దరఖాస్తులు వచ్చాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events