Skip to main content

Namaste NRI

దర్శకుడిగా కిరణ్‌ అబ్బవరం.. ఆసక్తికరంగా టైటిల్‌, గ్లింప్స్‌

హీరో కిరణ్‌ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి రియాలిటీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జాయ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సుధాకర్‌ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నది. టైటిల్‌ను ప్రకటిస్తూ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇందులో హోటల్‌ను నడుపుకునే ఆనంద్‌ అనే వ్యక్తిగా కనిపించారు కిరణ్‌ అబ్బవరం.

కుటుంబానికి ఉన్న అప్పులన్నీ తీర్చినరోజే తనకు నిజమైన ఆనందమని చెబుతుంటాడు. మధ్యతరగతి యువకుడి జీవితాన్ని ప్రతిబింబిస్తూ రియాలిటీ టైటిల్‌కు తగినట్లుగా ఆయన పాత్ర సాగింది. డిసెంబర్‌ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. దేవికాభట్‌, శరత్‌కుమార్‌, సాయికుమార్‌, రోహిణి, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events