వైద్యశాస్త్రంలో 2026 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. మెడిసన్‌లో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ దక్కింది. కార్ల్ డిసెరోత్, పీటర్ హేగ్‌మాన్, జార్జ్ నగేల్ మెడిసిన్ నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఐయాన్ ఛానల్స్‌తో పాటు ఆప్టో జెనటిక్స్‌లో ఆ ముగ్గురు శాస్త్రేవేత్తలు కొత్త డిస్కవరీ చేసినట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది. మెదడులో కలిగే ఆలోచనలు, జ్ఞపకాలు, భావోద్వేగాలు, ప్రవర్తనల గురించి పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆప్టోజెనటిక్స్‌లో కొత్త విషయాన్ని కొనుగొన్నారు. మెదడులో ఉన్న నాడీ కణాల స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్ యాక్టివిటీ గురించి ఈ శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే వీళ్లు కనుగొన్న పద్ధతుల్లోనే వివిధ దేశాల్లోనూ ల్యాబ్‌ల్లో మెదడు మిస్టరీని స్టడీ చేస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొన్నది.

అమెరికాలోని హోవార్డ్ హూగ్స్ మెడికల్ ఇన్స్‌టిట్యూట్ అండ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కార్ల్ డీసరోత్, జర్మనీలోని హమ్‌బోల్డ్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్‌లో పీటర్ హెగ్‌మాన్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ వుర్జ్‌బర్‌లో జార్జ్ నగేల్ ప్రొఫెసర్లుగా చేస్తున్నారు.ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రైజ్‌మనీ 12 మిలియన్ల స్వీడిష్ క్రానర్లుగా నిర్ధారించారు.















