Skip to main content

Namaste NRI

పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న మిస్టరీ, సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ మూవీ పోతిరెడ్డిపల్లి. హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై జేరమ్ విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా నటిస్తుండగా, మౌనిక, సిరి హీరోయిన్లుగా సందడి చేయనున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఘనంగా అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమాల్లో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, సీనియర్ నటుడు బాబు మోహన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్రబృందానికి తమ ఆశీస్సులు అందజేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్‌ను సీనియర్ నటుడు బాబు మోహన్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి ప్రారంభించగా, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే, తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ఈ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు వి. సముద్ర, ఓయూ శంకర్ గుండేటి తదితరులు కూడా పాలుపంచుకుని చిత్ర విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events