Skip to main content

Namaste NRI

వర్క్‌ వీసాలపై వచ్చే వారం కీలక నిర్ణయం?

విదేశీ కార్మికుల వీసా నిబంధనల అమలును మరింత కఠినతరం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోందని అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంథోనీ డి ఎస్పోసిటో స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగుల నియామకాలపై తనిఖీలను వేగవంతం చేస్తున్న తరుణంలో ఈ వారంలో అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని ఆయన వెల్లడించారు. అమెరికా ఉద్యోగాలు, అమెరికా కార్మికులకే అని తెలిపిన ఆయన ఫలానా కంపెనీలు, లేదా నిర్దిష్ట వీసా ప్రోగ్రామ్‌ పేర్లను వెల్లడించలేదు.

కాగా అమెరికన్‌ కార్మికులను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలకే లభించే విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు పలు కంపెనీలు హెచ్‌-1బీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం దేశ ప్రజలను మోసం చేయడమేనని, అందుకే హెచ్‌-1బీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినా తాను సమర్థిస్తానని వ్యాఖ్యానించారు.

కాగా సెప్టెంబర్‌ 18న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆదేశాల ప్రకారం విదేశీ ఉద్యోగులను స్పాన్సర్‌ చేసే కంపెనీలు గతంలో అమెరికన్‌ ఉద్యోగులను తొలగించాయా లేదా అనే దానిపై విదేశాంగ, కార్మిక, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టనున్నాయి. అలాగే గతంలో దాఖలు చేసిన కార్మిక దరఖాస్తులపై కూడా ఆడిట్‌ నిర్వహించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events