Skip to main content

Namaste NRI

మైత్రి మూవీ మేకర్స్ 418 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్‌ నుంచి రానున్న ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌ 418. అగ్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సమర్పిస్తున్న ఈ చిత్రంలో చైత్ర ఆచార్‌, సూర్యరాజ్‌, చరణ్‌ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్‌ పాటిల్‌ కీలకపాత్రధారులు. కీర్తన్‌ నాదగౌడ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 23న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్నది.

హారర్‌ మిస్టరీతో ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని, స్టన్నింగ్‌ విజువల్స్‌, చిల్లింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌, హంటింగ్‌ స్కోర్‌, సూపర్‌ నేచురల్‌ థ్రిల్స్‌తో గ్రిప్పింగ్‌ హారర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ సినిమా అందివ్వబోతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్‌ దివాకర్‌, సంగీతం: వెంకీ జీజీ, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events