టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆయనకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

హ్యాపీ బర్త్డే పృథ్వీ. ఈరోజు నీలోని కుంభను తట్టిలేపాలని నేను అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి తలరాతతో ముడిపడి ఉన్న కుంభ అతడు అంటూ రాజమౌళి రాసుకొచ్చారు. కుంభ అనేది వారణాసి చిత్రంలో పృథ్వీరాజ్ పోషిస్తున్న పాత్ర పేరు కావడం విశేషం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా జోనాస్ నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ సినిమాకే హైలైట్గా నిలవనుందని సమాచారం.















