
టెస్లా కంపెనీ నుంచి కొత్త కారు వస్తోంది. గాలిలో ఎగురుతూ డ్రైవింగ్ చేసే ఆ కారు ను టెస్లా కంపెనీ తాజాగా పరీక్షించింది. భూమి నుంచి కొన్ని ఫీట్ల మేర మీదకు ఎగురుతూ, మళ్లీ కిందకు వాలిన ఆ కారు డెమోను టెస్లా కంపెనీ నిర్వహించింది. టెక్సాస్‌లోని మెక్గ్రేగర్లో ఉన్న స్పేస్ఎక్స్ రాకెట్ డెవలప్మెంట్ కేంద్రంలో రోడ్‌స్టర్ 2 కారుకు చెందిన డెమో ప్రదర్శన జరిగింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ర్యాంప్‌పై ఆ ఫ్లయింగ్ కార్ తన స్టంట్స్ నిర్వహించింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్‌కు చెందిన పరిశోధనలు చాన్నాళ్ల నుంచే జరుగుతున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్ టెక్నాలజీతో ఈ కారును డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు గంటకు 100 కి.మీ. వేగాన్ని కేవలం 0.81 సెకన్లలో అందుకోగలదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కొత్త రోడ్‌స్టర్ 2028లో విడుదల కానున్నది.















