Skip to main content

Namaste NRI

నా కెరీర్‌లో గర్వపడే సినిమా రణబాలి : విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ తాజా చిత్రం రణబాలి శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ఇది నా 14వ సినిమా. ముప్పై సినిమాలు చేసిన తర్వాత కూడా ఒక సినిమా గురించి, అందులోని పర్‌ఫార్మెన్స్‌ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. అలాంటి చిత్రమే రణబాలి. ఈ సినిమా చేస్తున్నప్పుడు పెద్ద హిట్‌ కొట్టాలి. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద నెంబర్స్‌ క్రియేట్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోలేదు. అందరికి చెప్పాల్సిన కథ అనిపించింది. నా కెరీర్‌లో గర్వపడే సినిమా అవుతుంది అన్నారు. ఈ ఏడాది తెలుగు సినిమా నుంచి వచ్చిన బెస్ట్‌ఫిల్మ్‌ ఇదని చెప్పగలను. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్‌ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌తో ఓ రొమాంటిక్‌ సినిమా చేయబోతున్నా. మంచి స్క్రిప్ట్‌ కుదిరింది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రతీ సినిమా ఇష్టపడే చేస్తున్నా అన్నారు.

జీవితంలో ఏదైనా సాధించాలంటే పోరాడాలనే స్ఫూర్తిని అందించే చిత్రమిదని, ఇందులో రణబాలి, జయమ్మ పాత్రలను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నదని కథానాయిక రష్మిక మందన్న పేర్కొన్నది.

బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ఉందని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ మంచి ఆదరణ కనబరుస్తున్నారని నిర్మాత రవిశంకర్‌ అన్నారు. ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో భారీ హిట్‌గా నిలుస్తుందని నిర్మాత నవీన్‌ యెర్నేని చెప్పారు. సినిమా తీసిన మంచి ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకొని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events