Skip to main content

Namaste NRI

ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే .. బీజేపీ పాక్‌వైపే

ఒక వేళ యూఎస్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధం ఏర్పడితే భౌగోళిక సామీప్యత దృష్ట్యా బీజేపీ, పొరుగుదేశమైన పాకిస్థాన్‌కే మద్దతు ఇస్తుందని రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌ రాథోడ్‌ తెలిపారు. ఒక బహిరంగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికా-పాకిస్థాన్‌ దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే బీజేపీ ప్రభుత్వం పాకిస్థాన్‌ తరపునే ఉంటుంది, అది మన పొరుగుదేశం అని పేర్కొన్నారు. కానీ మన మధ్య ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మనం భారతదేశం పక్షాన నిలబడతాం కదా. మనం అర్థం చేసుకోవాల్సింది ఇదే అని ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events