Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం .. భార‌త్‌కు భారీ ఊర‌ట

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తూ ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భార‌త్‌, చైనా దేశాల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ర‌ష్యా వ‌ద్ద భారీ మొత్తంలో ఇంధ‌నం కొనుగోలు చేసే దేశాల‌పై 100 శాతం టారిఫ్ విధిస్తాన‌ని ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గ‌త నెల‌లో గ్ర‌హం యాక్ట్‌ను కూడా అమెరికా కాంగ్రెస్‌లో పాస్ చేశారు. అయితే ఆ చ‌ట్టం అమ‌లు చేయ‌డానికి 30 రోజుల గ‌డువు స‌మీపించ‌డంతో, ట్రంప్ అనూహ్యంగా ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దేశ ప్ర‌యోజ‌నాల‌ను ఉద్దేశించి ఆంక్ష‌లను ఎత్తివేస్తున్న‌ట్లు జారీ చేసిన ఆదేశాల్లో ట్రంప్ పేర్కొన్నారు.

ఆదేశాల‌కు సంబంధించిన స‌ర్టిఫికేట్‌ను అమెరికా కాంగ్రెస్‌కు స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీన గ్ర‌హం యాక్ట్‌ను పాస్ చేశారు. రెండు రోజుల త‌ర్వాత ఆ యాక్ట్‌ను చ‌ట్టంగా మారుస్తూ ట్రంప్ సంత‌కం చేశారు. అయితే ఆ చ‌ట్టం ప్ర‌కారం ర‌ష్యా నుంచి ఇంధ‌నం కొనుగోలు చేస్తున్న దేశాల‌పై వంద శాతం టారిఫ్ విధించాల‌నుకున్నారు. కానీ చ‌ట్టం అమలులోకి రావ‌డానికి 30 రోజుల గ‌డ‌వు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో, అనూహ్యంగా ట్రంప్ ఆ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events