చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశంతో రూపొందిన చిత్రం సమ్మర్ హాలిడేస్. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని నిర్మాత. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. జనానికి నచ్చే కటెంట్‌తో రూపొందిన సినిమా ఇది. థియేటర్స్‌లో కుటుంబసమేతంగా చూసి ఆనందించేలా సినిమా ఉంటుంది. ఇది పిల్లల సినిమా కాదు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా. పెద్దలకు బాల్యం గుర్తుస్తుంది. పిల్లలకు తమ జీవితాలను తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుంది. అందరికీ కనెక్టయ్యే సినిమా ఇది అని ధీరజ్ మొగిలినేని చెప్పారు.

సినిమా మొత్తం చూసుకున్న తర్వాత పూర్తి సంతృప్తిగా ఫీలయ్యామని, కొన్నేళ్ల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉండే సినిమా ఇదని దర్శకుడు శ్రీకర్ నమ్మకంగా చెప్పారు. సినిమాలో అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు బాలనటుడు రోహన్‌రాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి కూడా మాట్లాడారు.నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.















