నోవై, మిచిగాన్ – శంకర్ నేత్రాలయ – యూఎస్ఏ (SNUSA) సంస్థ మిచిగాన్‌లోని నోవైలో ఉన్న శ్రీ వెంకటేశ్వర టెంపుల్ & కల్చరల్ సెంటర్ లో “మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ ” కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతీయ సంస్కృతి, సంగీతం, నృత్యం, సేవాభావం కలగలిసిన ఈ కార్యక్రమం ఒక అందమైన సాంస్కృతిక వేడుకగా నిలిచింది. కళాకారులు, కుటుంబాలు, వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కంటి చూపును కాపాడటం, తిరిగి చూపును అందించడం, భారతదేశంలోని అవసరమైన వారికి నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం అనే SNUSA లక్ష్యానికి తమ మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న నాలుగు నృత్య పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది చిన్నారులు, టీనేజర్లు పాల్గొని కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించిన ఈ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పాల్గొన్న నృత్య పాఠశాలలు, గురువులు: స్థానిక
శ్రీ త్రిపుర సుందరి కూచిపూడి నృత్యలయ(గురు త్రిపుర సుందరి భాగవతుల), నాట్యధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (గురు సంధ్యా శ్రీ ఆత్మకూరు),అభినయ స్కూల్ ఆఫ్ డాన్స్ (గురు ధన్య వాణి రావు),నాట్యలయ అకాడమీ ఆఫ్ భరత నాట్యం (గురు ఐశ్వర్య అరుణ్ కుమార్ )నృత్య పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది యువ కళాకారులు తమ అంకితభావం, నృత్యం, భావ వ్యక్తీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ ప్రదర్శనలు అందరికీ మధురమైన అనుభూతిని మిగిల్చాయి.

సంగీత కార్యక్రమంలో స్థానిక గాయకులు వెంకట్ గోటూరు, భార్గవ్ గంటి, అశ్విని అయ్యార్, శ్రీ రంజిత చిత్రపు, రాద కల్లి, కీర్తన జగదీష్ తో పాటు కళ్యాణి మంత్ర ప్రగడ శిష్యులు తమ గానంతో ప్రేక్షకులను అలరించారు.

కాలిఫోర్నియా నుంచి వచ్చిన ప్రముఖ గాయని అంజన సౌమ్య , భారతదేశం నుంచి వచ్చిన ప్రముఖ గాయకుడు రాము మహా రాజపురం, అందించిన సంగీత ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోని మధురమైన, పాత జ్ఞాపకాలను గుర్తుచేసే పాటలతో వారు ప్రేక్షకులను అలరించారు. ఈ పాటలు అందరిలో ఆనందాన్ని నింపడమే కాకుండా, తమ సంస్కృతి, జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేశాయి.

SNUSA బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యుడు రమణ మూడేగంటి సంస్థ లక్ష్యాలను వివరిస్తూ, Mobile Eye Surgical Unit (MESU) కార్యక్రమం ద్వారా అందిస్తున్న కంటి వైద్య సేవల గురించి, దాని తాజా వివరాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
SNUSA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఎనిమిదేళ్ల నాయకత్వంలో, సంస్థ తన సేవలను ఏడు నగరాల నుంచి 30 నగరాలకు విస్తరించింది. అలాగే, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ కార్యక్రమంలో భాగంగా ఆపరేటింగ్ యూనిట్ల సంఖ్య రెండింటి నుంచి ఐదుకు పెరిగింది. మరో మూడు యూనిట్ల ఏర్పాటు పనులు కూడా కొనసాగుతున్నాయి.

ఈ కార్యక్రమం సమాజంలోని ఐక్యతను, సేవాభావాన్ని, దాతృత్వాన్ని మరోసారి చాటిచెప్పింది. ఆలయ నిర్వాహకులు, కళాకారులు, వాలంటీర్లు, కుటుంబాలు, దాతలు అందరూ కలిసికట్టుగా SNUSA లక్ష్యానికి మద్దతుగా నిలిచారు. చూపును కాపాడే ఈ మంచి కార్యంలో తమ వంతు సహకారం అందించారు. అందరి సమిష్టి కృషి, సహకారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో దోహదపడ్డాయి.

SNUSA డెట్రాయిట్ టీమ్‌లో బోర్డు ఆఫ్ ట్రస్ట్ సభ్యుడు
రమణ, ఫౌండేషన్ చైర్ ప్రతిమ కొడాలి,చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పెరుమాల్ల,కల్చరల్ లీడ్ త్రిపుర సుందరి భాగవతుల, చాప్టర్ లీడ్ వెంకట్ గోటూరు, రవి కవుటారపు పాల్గొన్నారు.
SNUSA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మార్గదర్శకత్వంలో, Dr. NRU , మూర్తి రేక పల్లి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
శంకర్ నేత్రాలయ – USA గురించి:
Sankara Nethralaya USA (SNUSA) భారతదేశంలోని ప్రముఖ కంటి వైద్య సంస్థ Sankara Nethralaya ఆశయాలకు మద్దతుగా పనిచేస్తోంది. నాణ్యమైన కంటి వైద్య సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, నివారించగల అంధత్వాన్ని అరికట్టడం కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, విరాళాలను సేకరిస్తోంది.
Mobile Eye Surgical Unit (MESU), Adopt-a-Village వంటి కార్యక్రమాల ద్వారా, కంటి వైద్య సేవలు సరిగా అందుబాటులో లేని ప్రాంతాల ప్రజలకు అవసరమైన వైద్య సేవలను చేరవేయడానికి SNUSA కృషి చేస్తోంది.

మరిన్ని వివరాల కోసం లేదా విరాళాలు అందించడానికి www.sankaranethralayausa.org వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా టోల్-ఫ్రీ నంబర్ (855) 463-8472 కు కాల్ చేయండి.
















