ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ప్రారంభంలోనే కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఒమిక్రాన్ ముప్పు ఉన్నట్లు భావిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఆర్టీ పీసీఆర్ పరీక్ష కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆయా దేశాల నుంచి వచ్చే వారు, గత 14 రోజుల్లో ఆ దేశాల సందర్శించినవారు విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. తొలివిడతలో హైదరాబాద్ సహా ఢల్లీి, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులకు దీన్ని వర్తింపజేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. డిసెంబరు 20 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇందుకుగాను ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి ఎయిర్ సువిధ పోర్టల్‌ను వినియోగించుకోవచ్చు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)