ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు`నేడు పెండిరగ్ పనుల పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టు 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆగస్టు 15లోపు టీచర్లకు వ్యాక్సినేషన్ వేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్టులోనే విద్యా కానుక, నాడు`నేడు రెండో విడత పనులు ప్రారంభం కావాలన్నారు. తొలివిడత పనులు పూర్తైన పాఠశాలలను ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. నూతన విద్యావిధానాన్ని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తోందన్నారు. దీని వల్ల ఏ స్కూల్ మూతపడదని, ఏ ఉపాధ్యాయుడి పోస్టు తగ్గదని అన్నారు. రెండేళ్లలో ఫౌండేషన్ స్కూళ్లకు అదనపు గదులను నిర్మిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థులకు 70 శాతం ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు, పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరు లోపు ఇంటర్ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని తెలిపారు.