ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకల రేపుతోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ఫాసీ సూచించారు. ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనాలనే ఉద్దేశ్యంతో బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. ఎక్కువ మంది గుంపులుగా చేరే కార్యక్రమాలకు వెళ్లొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాథమిక పరిశోధనల్లో డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని తేలిందని అన్నారు. అయితే అమెరికన్లు జాగ్రత్తలు పాటించాలని, లేదంటే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పిల్లల్ని కరోనా నుంచి కాపాడంటే వారి చుట్టూ ఉండే పెద్దలందరూ తప్పనిసరిగా కరోటీ టీకా వేయించుకోవాలని సూచించారు.