ఇరాన్‌కు అగ్రరాజ్యం అమెరికా షాక్ ఇచ్చింది. ఇరాన్ నుంచి యెమెన్‌కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. పాకిస్థాన్, ఒమన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కలుష్నికోవ్ తరహా రైఫిళ్లు, మెషీన్ గన్స్, రాకెట్ గ్రనేడ్ లాంచర్లతో పాటు దాదాపు 2.3 లోల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యూఎస్ఎస్ ఓకేన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి, చేపల పడవను సముద్రంలో ముంచేశారు. చాన్నాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.