Namaste NRI

బ్యాక్ డోర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ  త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన చిత్రం బ్యాక్‌ డోర్‌. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.    హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకలో నటి జీవితా రాజశేఖర్‌, అడిషనల్‌ ఎస్పీ కేజీవీ సరిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటి పూర్ణ మాట్లాడుతూ నాకు బ్యాక్‌ డోర్‌ వంటి మంచి సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం వచ్చిన కర్రి బాలాజీకి కృతజ్ఞతలు  తెలిపారు. ఈ సినిమా పూర్ణ కెరీర్‌లో ఓ మైల్‌ స్టోన్‌గా నిలిచిపోతుంది అన్నారు కర్రి బాలాజీ. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నాం అని  ఈ  చిత్రం ప్రపంచ వ్యాప్త థియేట్రికల్‌ హక్కులు సొంతం చేసుకున్న కందల కృష్ణారెడ్డి అన్నారు.  ఈ కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, టి.రామసత్య నారాయణ, డి.ఎస్‌.రావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ప్రణవ్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ నారోజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events